: `మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం` హెచ్చ‌రిక `స్పైడ‌ర్‌` సినిమాకు అవ‌స‌రం లేదట!


సాధార‌ణంగా సినిమా ప్రారంభానికి ముందు `మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం` అని హెచ్చ‌రిక జారీ చేస్తుంటారు. సినిమాలోని పాత్ర‌లు మ‌ద్య‌పానం, ధూమ‌పానం సేవిస్తున్న‌పుడు కింద ఈ హెచ్చ‌రిక క‌నిపిస్తుంటుంది. కానీ మ‌హేశ్‌బాబు `స్పైడ‌ర్‌` సినిమాకు దాని అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్క‌డా హీరో మ‌హేశ్ గానీ, విల‌న్ ఎస్‌జే సూర్య గానీ మందుకొడుతున్న‌ట్లు, పొగ తాగుతున్న‌ట్లు చూపించ‌లేద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా మ‌ద్య‌పానానికి బ‌దులు విల‌న్ సూర్య గ్రీన్ టీ తాగుతూ క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే `స్పైడ‌ర్‌` సినిమా హిందీ వెర్ష‌న్‌కి ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు మ‌ద్య‌పానం హెచ్చ‌రిక వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమోదం కూడా ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఇక తెలుగు వెర్ష‌న్‌కి కూడా అలాంటి ఆమోద‌మే ల‌భిస్తుంద‌ని నిర్మాత‌లు అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News