: ఢిల్లీలో దారుణం.. నడుస్తున్న కారులో విదేశీ వనితపై సామూహిక అత్యాచారం


దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం సంభవించింది. నడుస్తున్న కారులో ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సదరు బాధితురాలు షాపింగ్ కోసం వసంతకుంజ్ ప్రాంతానికి వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యాక ఆమె తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరింది.

మార్గమధ్యంలో ఆటోలో సాంకేతిక లోపం తలెత్తడంతో... ఆమెను దించేసిన ఆటో డ్రైవర్ వేరే వాహనంలో వెళ్లమని చెప్పాడు. ఆ సమయంలో వేరే వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఖిర్కీ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఆమెను వదిలివెళ్లారు. ఆ తర్వాత ఆమె జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.  

  • Loading...

More Telugu News