: బాలీవుడ్‌లో మరో క్రీడాకారుడి బయోపిక్... అభినవ్ బింద్రాగా నటించనున్న అనిల్ కపూర్ తనయుడు
`మేరీ`, `అజహర్`, `ఎంఎస్ ధోనీ` ఇలా బాలీవుడ్‌లో వచ్చిన క్రీడాకారుల బయోపిక్‌లన్నీ సూపర్ హిట్లుగానే నిలిచాయి. అదేకోవలో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా బయోపిక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ఇందులో అభినవ్ బింద్రా పాత్రను అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ పోషించనున్నాడు. ఈ విషయాన్ని హర్షవర్ధన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్లో వెల్లడించాడు. అభినవ్‌తో పాటు దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. కెరీర్ ప్రారంభంలోనే అభినవ్ లాంటి దేశం గర్వించదగ్గ క్రీడాకారుడి పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని హర్షవర్ధన్ పేర్కొన్నాడు. గతేడాది రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో `మీర్జాయా` సినిమా ద్వారా హర్షవర్ధన్ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.