: రాజకీయ లబ్ది కోసమే నా పౌరసత్వాన్ని వివాదం చేశారు: ఎమ్మెల్యే చెన్నమనేని


రాజకీయ లబ్ది కోసమే తన పౌరసత్వాన్ని వివాదం చేశారని వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆరోపించారు. భారత్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కోలేని శక్తులు తనపై కేసులు వేశాయని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ నిర్ణయంపై రివిజన్ ద్వారా ప్రశ్నించే హక్కును వినియోగించుకుంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకు ఎటువంటి పదవీ లేని సమయంలోనే సుమారు పదిహేడేళ్ల పాటు ప్రజా సేవ చేశానని, అవకాశం ఉన్నంత వరకు మాతృభూమికి సేవ చేస్తానని చెప్పిన రమేశ్, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News