: వెధవలను వైసీపీ ప్రోత్సహించిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు: చంద్రబాబు విమర్శ
బెజవాడలో వైసీపీ నేతలు గొడవపడి రోడ్డెక్కారని, వెధవలను వైసీపీ ప్రోత్సహించిందని స్వయంగా ఆ పార్టీ నేతలే అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలో రెండో రోజూ టీడీపీ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జగన్ లాంటి నాయకుడు ఉంటే, అలాంటి నేతలనే ప్రోత్సహిస్తారని అన్నారు. నెల్లూరు, కాకినాడలో జరిగిన క్రికెట్ బెట్టింగుల్లో ప్రతిపక్షనేతలు ఉన్నారని, తన జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదని అన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, పార్టీలకు అతీతంగా లబ్దిదారుల ఎంపిక జరగాలని, ‘ప్రజలకు మనం చేసేదే చెప్పండి..అబద్ధాలు చెప్పొద్దు’ అని నేతలకు బాబు సూచించారు. నేతల మనస్తత్వాలను విశ్లేషించేందుకు 20 ప్రశ్నల జాబితాను వారికి చంద్రబాబు అందజేశారు. కాగా, ఈ సందర్భంగా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ సర్వేలను..నేతలు ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు పోల్చి చూశారు.