: గురుదక్షిణ: గోపీచంద్ జీవితంపై సినిమా నిర్మిస్తున్న సింధు!
తనను ఒలింపిక్ మెడల్ సాధించే స్థాయికి తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్‌కి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీచర్స్ డే బహుమతి ఇచ్చింది. ఆయన తనను తీర్చిదిద్దిన అంశాలను జోడిస్తూ ఓ డిజిటల్ సినిమాను నిర్మించనుంది. స్పోర్ట్స్ డ్రింక్ కంపెనీ గాటోరెడోతో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో గోపీచంద్‌తో ఆమె ప్రయాణాన్ని చూపించనున్నట్లు సమాచారం. `కోచ్ సార్ నా కోసం చాలా కష్టపడ్డారు. నా మీద నాకంటే కూడా ఆయనకే నమ్మకం ఉండేది. ఆయన నా కోసం పడిన శ్రమ రుణాన్ని గాటోరెడో వారితో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కొంత తీర్చుకుందామని అనుకుంటున్నా` అని సింధు చెప్పింది. ఈ టీచర్స్ డే సందర్భంగా తాను సాధించిన విజయాలన్నింటినీ కోచ్ గోపిచంద్‌కు అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొంది.