: 'రాయలసీమ పరిరక్షణ సమితి' పార్టీని మూసివేస్తున్నా: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ (ఆర్పీఎస్)ని మూసివేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాను కానీ, వారి నుంచి సరైన ప్రోత్సాహం తనకు లభించలేదని అన్నారు. ఏ పార్టీలో చేరే విషయాన్ని తాను త్వరలో ప్రకటిస్తానని అన్నారు.
అయితే, టీడీపీలో చేరమని బైరెడ్డి అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా, రాయలసీమ పరిరక్షణ పార్టీని 2013లో బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్థాపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 జులై 30న తీర్మానం వెలువడిన అనంతరం ఆర్పీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంతీయ తత్వ భావజాలంతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఏపీలోని కర్నూలులో ఉంది. ఈ పార్టీ స్థాపించకముందు ఆయన టీడీపీలో ఉన్నారు.