: 9 ఏళ్ల క్రితం నాటి తీపిగుర్తును నెమరువేసుకుని మురిసిపోయిన హీరో నాని!
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న నటుడు నాని.. 9 ఏళ్ల క్రితంనాటి తీపి గుర్తును నెమరువేసుకున్నాడు. ఆ నాడు తన మొదటి సినిమా ‘అష్టా-చమ్మా’ ఆడుతోన్న థియేటర్ ముందు ఉంచిన హౌస్ ఫుల్ బోర్డు ముందు నిలబడి తాను తీసుకున్న ఫొటోను నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నటనలో అప్పటి నుంచి ప్రారంభమైన తన కెరీర్ విజయవంతంగా కొనసాగుతోందని, తమ సొంత మనిషిలా ప్రేక్షకులు తనను చూసుకుంటున్నారని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల ‘నిన్ను కోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని చేతిలో ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ చిత్రం ఉంది.