: ఉత్తర కొరియా దుందుడుకు చర్యలు ప్రపంచానికే ముప్పు: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన
ఎవరిమాటా వినకుండా వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేపడుతోన్న ఉత్తరకొరియా దుందుడుకు చర్యలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా ప్రస్తుతం ప్రపంచ ముప్పుగా పరిణమించిందని ఐఏఈఏ అధినేత యుకిహ అమానో అన్నారు. ఆ దేశ చర్యలు గతంలో ప్రాంతీయ సవాలుగానే ఉండేవని, కానీ ఇప్పుడు అణ్వాయుధాలు, క్షిపణులు కలిగిన ప్రపంచ ముప్పుగా మారాయని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడంతో దక్షిణకొరియా తమ దేశానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా పలు చర్యలు తీసుకుంటోంది.