: బ్లూ వేల్‌ గేమ్ బారిన పడ్డ బాలిక.. పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి సరస్సులో దూకిన వైనం!


బ్లూ వేల్ గేమ్ ఆడుతోన్న ఓ 17 ఏళ్ల బాలిక నిన్న అర్ధరాత్రి స‌ర‌స్సులోకి దూకేసిన ఘ‌ట‌న రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను కుమార్తె అయిన ఆమె... నిన్న రాత్రి త‌న స్కూటీ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లి ఎంత‌కూ తిరిగి రాలేదు. ఆమెకు తల్లిదండ్రులు ఫోన్ చేయ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో ఆ బాలిక త‌ల్లిదండ్రులు కంగారు ప‌డిపోయి ఆమె కోసం ఊరంతా వెతికారు. వారికి త‌మ ప్రాంతంలోని సరస్సుకు కొద్ది దూరంలో త‌మ కూతురి స్కూటీ క‌నిపించింది.

దీంతో వారు వెంట‌నే పోలీసుల‌కు ఫోన్ చేసి ఈ విష‌యాన్ని చెప్పారు. వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. అదే స‌మ‌యంలో ఆ బాలిక కొండపైకి ఎక్కుతూ కన్పించడంతో ఆమెను కింద‌కి రమ్మ‌ని అంద‌రూ పిలిచారు. అయిన‌ప్ప‌టికీ ఆమె ముందుకు వెళ్లి అక్కడి నుంచి సరస్సులోకి దూకేసింది. ఆమెను రక్షించిన పోలీసులు తిరిగి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌జెప్పారు. ఆమె చేతిపై కత్తితో బ్లూవేల్ గుర్తు కనిపించింది. తాను బ్లూవేల్ గేమ్ ఆడి చివ‌రి టాస్క్‌కు చేరుకున్న‌ట్లు ఆమె చెప్పింది.  

  • Loading...

More Telugu News