: రైల్వే కార్యాలయంలో హెడ్ క్లర్క్ రాసక్రీడ... వెలుగు చూసిన సీసీ టీవీ పుటేజ్!
రైల్వే పార్శిల్ కార్యాలయంలో విధినిర్వహణలో ఉండగా ఓ యువతితో హెడ్ క్లర్క్ రాసక్రీడలు సాగించిన బాగోతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ హక్కుల కార్యకర్త చేతిలో పడి కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ లోని రైల్వే పార్శిల్ కార్యాలయాల్లో సాగుతున్న అక్రమాలను బయటపెట్టేందుకు సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు సీసీటీవీ పుటేజ్ ను సేకరించారు. ఈ సీసీటీవీ పుటేజ్ లో లోకమాన్య తిలక్ టెర్మినల్ పార్శిల్ విభాగంలో రాత్రివేళ విధినిర్వహణలో ఉన్న రైల్వే హెడ్ క్లర్కు అజయ్ బోస్ ఒక యువతితో సన్నిహితంగా మెలగడం సీసీటీవీ పుటేజ్ లో వెలుగు చూసింది.
90 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో యువతి చేతులు పట్టుకొని చెట్టాపట్టాలేసుకోవడం, పక్క పక్కన కూర్చొని భోజనం చేయడం, యువతి పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడం దాకా అంతా రికార్డయింది. సదరు యువతి ఒక బార్ లోని ఆర్కెస్ట్రాలో పని చేస్తుందని తెలుస్తోంది. సదరు యువతిని తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది వెలుగు చూడడంతో సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ రవీంద్ర గోయల్ మాట్లాడుతూ, దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే సదరు యువతి తనకు తెలుసని, ఢిల్లీ వెళ్లే విమానం మిస్ కావడంతో ట్రైన్ లో వెళ్లేందుకు వచ్చిందని, సురక్షితంగా ఉంటుందని తాను తన కార్యాలయంలో కూర్చోబెట్టానని సదరు క్లర్క్ చెబుతుండడం విశేషం.