: ఇథనాల్‌తో కేన్సర్ చికిత్సను సాధ్యం చేసిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు
సాధారణంగా మద్యపానం తయారీలో ఉపయోగించే ఇథనాల్ ద్వారా కేన్సర్‌కు చికిత్స చేయవచ్చనే విషయాన్ని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అతి తక్కువ ఖర్చుతో కేన్సర్ నయం చేయగల ఈ చికిత్సలో ఉన్న కొన్ని లోపాలను కూడా ఇటీవల డ్యూక్ శాస్త్రవేత్తలు సవరించారు. `ఇథనాల్ ఆబ్లేషన్` పేరుతో పిలిచే ఈ చికిత్సలో ఇథనాల్‌ను నేరుగా కేన్సర్ కణాల్లోకి పంపించడానికి అధిక మొత్తంలో ఇథనాల్ అవసరమయ్యేది. అలాగే స్వచ్ఛమైన ఇథనాల్ పంపించడం ద్వారా కేన్సర్ కణాలను అంటిపెట్టుకుని ఉన్న ఆరోగ్యకణాలపై కూడా ప్రభావం ఉండేది. అయితే చికిత్సలో ఇథనాల్‌తో పాటుగా కొద్దిగా సెల్యులోజ్ కలపడం ద్వారా ఈ రెండు లోపాలను అధిగమించవచ్చని డ్యూక్ పరిశోధకులు కనిపెట్టారు.
ఇందుకోసం వారు కొన్ని హ్యామ్‌స్టర్లకు (ఎలుక లాంటి జంతువు) కేన్సర్ కణాలను జొప్పించి, తర్వాత వాటికి ఇథనాల్, సెల్యూలోజ్ కలిపిన ఇథనాల్‌ల ద్వారా చికిత్స చేశారు. వీటిలో ఇథనాల్ ఎక్కించిన హ్యామ్‌స్టర్లలో కేన్సర్ కణాలు నశించే రేటు, సంఖ్య, సెల్యూలోజ్ కలిపిన ఇథనాల్ ఎక్కించిన హ్యామ్‌స్టర్ల కంటే తక్కువగా ఉంది. సెల్యూలోజ్ కలిపిన ఇథనాల్ కేన్సర్ కణాల్లోకి వెళ్లగానే జెల్‌గా మారి, కణం నశించే రేటు క్రియాశీలకంగా మారుస్తుందని, ఇథనాల్ కణం నుంచి బయటికి రాకుండా జెల్ ఉపయోగపడటం వల్ల ఇతర ఆరోగ్య కణాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పరిశోధకులు తెలిపారు. అలాగే సెల్యూలోజ్ కలపడం వల్ల ఇథనాల్ అధిక మొత్తంలో అవసరం లేకుండా పోయిందని వారు వివరించారు.
పూర్తి వివరాల కొరకు క్లిక్ చేయండి ..
https://www.nature.com/articles/s41598-017-09371-2