: గాయని అవతారమెత్తుతున్న మాధురీ దీక్షిత్
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ త్వరలో గాయనిగా మారి, ఓ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. `ది ఫిల్మ్ స్టార్` ఆల్బం ద్వారా ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో `తు హీ మేరా` అనే పాటను ప్రత్యేకంగా తన అభిమానుల కోసం మాధురి అంకితం చేసింది. భారత జానపద సంగీతానికి, పాశ్చాత్య బాణీలను సమకూర్చి సృష్టించిన పాటలతో ఈ ఆల్బం ఉంటుందని మాధురీ దీక్షిత్ పేర్కొంది. హాలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన కోల్డ్‌ప్లే, అడెలె, జెస్సీ జే, కేటీ పెర్రీ, సియా వంటి దిగ్గజ పాప్ సింగర్లతో కలిసి పనిచేసిన 'ఏ అండ్ ఆర్ వరల్డ్‌వైడ్ మ్యూజిక్' కంపెనీ ఈ ఆల్బంను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.