: భారత్ తో ఓటమికి కారణాలివే: శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ


టీమిండియాతో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌ లలో ఘోరవైఫల్యానికి కారణాలను శ్రీలంక జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ వివరించాడు. జట్టులో స్థిరత్వం లేకపోవడంతో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో పూర్తిగా విఫలమయ్యామని తెలిపాడు. దానికి తోడు ఫీల్డింగ్‌ లో ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఓటమిపాలయ్యామని తెలిపాడు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. తాము ఇంత దారుణంగా విఫలం కాగా, టీమిండియా అద్భుతంగా ఆడిందని అన్నాడు. టీమిండియాలో స్థిరత్వం ఉందని చెప్పాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ పరుగుల వరదపారించారని చెప్పాడు. సామర్థ్యం ఉన్నప్పటికీ తాము విఫలం కావడం తనను కలచివేస్తోందని ఉపుల్ తరంగ తెలిపాడు. 

  • Loading...

More Telugu News