: కమలహాసన్‌తో నగ్మా భేటీ.. తమిళనాట హాట్ టాపిక్!


తమిళ రాజకీయాలపై ఇటీవల విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్‌తో కాంగ్రెస్ పార్టీ నేత, సినీనటి నగ్మా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం చెన్నయ్, అళ్వార్‌పేటలోని కమల్ ఇంటికి వెళ్లిన నగ్మా గంటపాటు భేటీ అయ్యారు. రాజకీయాల గురించి వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపైన కూడా వీరు చర్చించుకున్నట్టు సమాచారం. వీరిద్దరి భేటీ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. తమిళ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కమల్ తన రాజకీయ ప్రవేశం ఎప్పుడో జరిగిపోయిందని ఇటీవల ప్రకటించి సంచలనం రేపారు.

  • Loading...

More Telugu News