: ఐక్యరాజ్య సమితిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా


ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియాపై అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో...అమెరికా వాదనను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి లూజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి విషవలయంలా మారిందని లూజీ అన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, అణువ్యాప్తి తగ్గింపు విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఉత్తరకొరియాను అభ్యర్థిస్తూనే ఉన్నామని లూజీ తెలిపారు. ఉత్తరకొరియాను అణ్వాయుధాలు వదులుకోవాలని డిమాండ్‌ చేస్తోన్న అమెరికా...తనకుతానుగా అణ్వాయుధాలను వదులుకుంటోందా? అని ప్రశ్నించారు.

ఉత్తరకొరియాపై మరోసారి ఆంక్షలు విధించాలన్న ఆలోచన లేదా ప్రణాళికను చైనా, రష్యాలు ఏమాత్రం సమర్థించవని లూజీ స్పష్టం చేశారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనాలన్న లూజీ అందుకు అమెరికా, దాని అనుబంధ దేశం దక్షిణకొరియా వెనక్కితగ్గాలని సూచించారు. ముందుగా సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని లూజీ డిమాండ్ చేశారు. మీరు మొండికేస్తే, వాళ్లు కూడా మొండికేస్తారని లూజీ సూచించారు. 

  • Loading...

More Telugu News