: 79 ఏళ్ల తర్వాత స్పిన్ బౌలింగ్ తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం.. చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్!
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ టెస్ట్ చరిత్రలో 79 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్‌ను స్పిన్ బౌలింగ్‌తో ప్రారంభించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చివరిసారి 1938లో బిల్ ఒ’రీలీ టెస్ట్ మ్యాచ్‌ను స్పిన్ బౌలింగ్‌తో ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో తొలి రోజే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సోమవారం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో నాథన్ లియాన్ బౌలింగ్‌కు దిగి చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లోనూ 79 ఏళ్ల నాటి సీనే రిపీటైంది. 28 ఓవర్లు వేసిన లియాన్ ఆరు మెయిడెన్లు తీసుకున్నాడు. 77 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడి దెబ్బకు బంగ్లా జట్టు విలవిల్లాడింది.