: అదో కుటుంబ వేడుక.. లాలు పాట్నా ర్యాలీపై నితీశ్ కుమార్ విసుర్లు!


ఆర్డేడీతో తెగదెంపులు చేసుకున్నాక ఆ పార్టీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో జేడీయూకు చోటు దక్కకపోవడంపై లాలు సెటైర్ వేసిన మరునాడే నితీశ్ కూడా రంగంలోకి దిగారు. ఆగస్టు 27న ఆర్జేడీ ఆధ్వర్యంలో పాట్నాలో నిర్వహించిన ‘బీజేపీ భగావో, దేశ్ బచావో’ (బీజేపీని తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి) ర్యాలీ కుటుంబ వేడుకని తలపించిందని నితీశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఆ ర్యాలీలో రాజకీయం ఏముందని, అది పూర్తిగా కుటుంబ వేడుకను తలపించిందని, తాను అదే విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్, జేడీయూ రెబల్ నేత శరద్ యాదవ్ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన జనాల గురించి ప్రస్తావిస్తూ.. అదంతా ఫొటోషాప్ మహిమ అని ముఖ్యమంత్రి కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News