: అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు.. తరలిపోతున్న వేలాదిమంది
అమెరికాను కార్చిచ్చు దహించి వేస్తోంది. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్, ఓరెగాన్, మోంటానాలు కార్చిచ్చులో చిక్కుకున్నాయి. విపరీతమైన వేడితోపాటు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగకు తట్టుకోలేని వేలాదిమంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. లాస్ ఏంజెలెస్ కౌంటీ లా టునాలో కార్చిచ్చు 23 కిలోమీటర్ల మేర వ్యాపించింది. మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మోంటానాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌కూ మంటలు వ్యాపించాయి. ఇక ఓరెగాన్‌లో పర్వతారోహణకు వెళ్లి చిక్కుకుపోయిన 140 మంది పర్వతారోహకులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు.