: తెలంగాణలో బీజేపీ డ్రామాలు సాగవు: ఎంపీ బాల్క సుమన్


మతఘర్షణలు లేపి చలి కాచుకోవాలని బీజేపీ చూస్తోందని, తెలంగాణలో బీజేపీ డ్రామాలు సాగవని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. అస్థిత్వం కోసమే బీజేపీ విమోచన యాత్ర నిర్వహిస్తోందని, సెప్టెంబర్ 17ను బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నేతలకు చేతనైతే జూన్ 2 వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీని ఇక్కడికి పిలిపించాలని, ఆయనతో లక్షో, రెండు లక్షల కోట్ల సాయమో ఇప్పించాలని సవాల్ విసిరారు. త్వరలో టీచర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు బాల్క సుమన్ ఈ సందర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News