: షారుక్ ఖాన్ కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
త్వరలో షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా రాబోతున్న `టెడ్ టాక్స్ ఇండియా` కార్యక్రమంలో టెలిప్రజెన్స్ రోబో ద్వారా కాలిఫోర్నియా నుంచి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పాల్గొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమేనని షారుక్ చేసిన ట్వీట్ ద్వారా స్పష్టమైంది. తన కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుందర్ పిచాయ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ షారుక్ ట్వీట్ చేశారు.
దీనికి సమాధానంగా - `మీతో మట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి నేరుగా కలుద్దాం` అని సుందర్ ట్వీట్ చేశారు. షారుక్ కూడా `త్వరలో కాలిఫోర్నియా వస్తాం అప్పుడు కలుసుకుందాం` అంటూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరోసారి సుందర్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఏక్తా కపూర్, కరణ్ జోహార్, మిథాలీ రాజ్ వంటి ప్రముఖులను షారుక్ ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్, ఏఆర్ రహమాన్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.