: జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన విజయ సాయిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టులో ఎంపీ విజయ సాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ, వాన్‌పిక్, జగతిలో పెట్టుబడుల కేసుల్లో తన పేరును తొలగించాలని ఆయన కోరారు. అయితే, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కౌంటర్‌లో సీబీఐ కోరింది. జగతిలో మోసపూరిత పెట్టుబడుల కేసులో తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది.