: వంగవీటి రాధా, ఆయన తల్లిపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు!
వంగవీటి రంగాపై వైసీపీ నుంచి సస్పెండైన నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే విజయవాడ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు, భార్యలను చూసి వంగవీటి రంగా ఎంతో గర్వపడుతుంటారని... స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా చేస్తుంటారని కామెంట్ చేశాడు. తనకు కూడా వంగవీటి రంగా భార్య, కుమారుడు అంటే ఎంతో అభిమానమని చెప్పాడు. తల్లి నల్లగా, కుమారుడు తెల్లగా ఎందుకున్నారో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ 'లోరియల్' చెప్పాలని అన్నాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్ లో రత్నకుమారి, రాధాలు నేలపై కూర్చున్న ఫొటోను కూడా అప్ లోడ్ చేశాడు.