: ఆమిర్ ఖాన్ తదుపరి చిత్రంలో ప్రియాంక చోప్రా?
త్వరలో మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, మిస్ ఫర్‌ఫెక్ట్ ప్రియాంక చోప్రా కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. భారత వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథతో రానున్న `శాల్యూట్` చిత్రంలో రాకేశ్ భార్య పాత్రలో ప్రియాంక కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో `దంగల్` స్టార్ ఫాతిమా షేక్ సనా కూడా ఓ కీలక పాత్రలో నటించబోతోందన్న వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా సంజయ్ లీలా భన్సాలీ `గుస్తాకియాన్` చిత్రం నుంచి ప్రియాంక తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్లు సెట్ కాకపోవడం వల్లే ప్రియాంక ఆ సినిమా చేయడం లేదని ఆమె తల్లి మధు చోప్రా స్పష్టం చేశారు. అయితే ఆమిర్ ఖాన్‌తో ప్రియాంక నటించే విషయంపై కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. కాకపోతే ఈ సినిమా కోసం పరిశీలిస్తున్న పేర్లలో ప్రియాంకకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.