: నివురుగప్పిన నిప్పులా విజయవాడ... రాధా, గౌతమ్ రెడ్డి నివాసాల వద్ద పోలీసుల మోహరింపు!
విజయవాడ నివురుగప్పిన నిప్పులా ఉంది. కాంగ్రెస్ దివంగత నేత వంగవీటి రంగా హత్యపై గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు రాధ, ఆయన తల్లి రత్నకుమారి బయటకు రాగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం గౌతమ్ రెడ్డిని వైఎస్సార్సీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి నివాసంతో పాటు, వంగవీటి రాధా నివాసం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా నగరంలో పలు చోట్ల పోలీసులను మోహరించారు.