: ఆల్మట్టి ఎత్తు పెంపును నిరాకరించిన పర్యావరణ శాఖ... సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తెచ్చుకోండని సూచన


కర్ణాటక ప్రభుత్వానికి పర్యావరణ శాఖ వద్ద చుక్కెదురైంది. తుంగభద్ర నదిపైనున్న ఆల్మట్టిడ్యాం ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జలవనరుల శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని పక్షాలు స్వాగతించడంతో అనుమతులు తెచ్చుకునేందుకు పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయగా. ఆల్మట్టి ఎత్తు పెంపుకు పర్యావరణ శాఖ అభ్యంతరం చెప్పింది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును ఎగువనున్న మహారాష్ట్రతో పాటు దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని పర్యావరణ శాఖ కర్ణాటక జలవనరుల శాఖకు సూచించింది. 

  • Loading...

More Telugu News