: కర్ణాటకలో అమానుషం.. రూ.4వేల అప్పు తిరిగి చెల్లించలేదని కార్మికుడిని కుక్కలబోనులో వేసిన యజమాని!


కర్ణాటకలో ఓ తోటల యజమాని తన వద్ద పనిచేస్తున్న రోజువారీ కార్మికుడిపై అమానుషంగా ప్రవర్తించాడు. తన వద్ద తీసుకున్న రూ.4వేల అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో అతడిని ఏకంగా కుక్కల బోనులో వేసి బంధించాడు. బోనులోకి వచ్చిపడిన కార్మికుడు హరీష్ (32)పై శునకాలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. హరీష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హరీష్‌పై మూడు శునకాలు దాడి చేశాయని, తల, కాళ్లు, చేతులు, మెడపై అతడికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కాఫీ తోట యజమాని కిషన్‌పై హత్య కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

హరీష్ కొన్ని నెలల క్రితం కిషన్ వద్ద రూ.4వేలు అప్పు తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించకపోగా పనిలోకి రావడం మానేశాడు. బాలెలి గ్రామంలోని కిషన్ బంధువుల దుకాణంలో హరీష్ పనికి కుదిరాడు. విషయం తెలుసుకున్న కిషన్.. మధు అనే మరో వ్యక్తితో కలిసి వెళ్లి అప్పు చెల్లించాల్సిందిగా కోరాడు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని హరీష్ చెప్పడంతో ఇద్దరూ కలిసి అతనిని బలవంతంగా జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లి తన పెంపుడు కుక్కల బోనులో వేసి బంధించారు. కుక్కలు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో చనిపోతాడని భావించిన కిషన్ బయటకు లాగి సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మైసూరుకు తరలించారు.

  • Loading...

More Telugu News