: మలుపులు తిరుగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు... దినకరన్ శిబిరం నుంచి ఐదుగురు జంప్!
తమిళనాడు అధికార పార్టీ రాజకీయాలు పలు మలుపులు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. పళనిస్వామి, పన్నీరు సెల్వం కలయిక నచ్చలేదని, శశికళే 'అమ్మ తరువాతి అమ్మ' అంటూ టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచిన సంగతి తెలిసిందే. తమకు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారని, తాను ఎప్పుడు చెబితే అప్పుడు వారు బయటకు వస్తారని దినకరన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దినకరన్ రిసార్ట్ లో ఉంచిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నేడో రేపో చేజారిపోనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దినకరన్ వారిని కాపాడుకునేందుకు హైదరాబాదు తరలించనున్నట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాదులో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.