: డప్పు దరువులతో హోరెత్తుతున్న ట్యాంక్ బండ్!


డప్పు దరువులు, డీజే సౌండ్ సిస్టమ్, గణపతి బప్పా మోరియా నినాదాలతో గత మూడు రోజులుగా ట్యాంక్ బండ్ హోరెత్తుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా గణపతి విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం నెలకొంది. ఇప్పటి వరకు జంటనగరాల్లోని 50 శాతం విగ్రహాల నిమజ్జనం పూర్తైనట్టు పోలీసులు చెబుతున్నారు. రేపు వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపును కూడా సూచించారు. నగర వ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించేందుకు క్రేన్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News