: పినాకిని ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం!


పినాకిని ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకిని ఎక్స్ ప్రెస్ గుంటూరు జిల్లా తెనాలి దాటిన తరువాత మల్లిపాడు వద్ద శబ్దం మారడంతో అప్రమత్తమైన ట్రైన్ డ్రైవర్ రైలును నిలిపివేశాడు. అనంతరం పరిశీలించగా, మల్లిపాడు వద్ద పట్టా విరిగిపోయి ఉండడాన్ని గుర్తించారు. డ్రైవర్ ముందుగా అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పెను ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. 

  • Loading...

More Telugu News