: కోర్టు దెబ్బకు స్పందించిన పాక్ మాజీ నియంత.. పాక్ వచ్చి, భుట్టో కేసును ఎదుర్కొంటానని స్పష్టం చేసిన ముషారఫ్!


తాను పాకిస్థాన్ కు తిరిగి వస్తానని, మాజీ ప్రధాని బెనజిర్ భుట్టో హత్య కేసును ఎదుర్కొంటానని పాకిస్థాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఎదుర్కొంటున్న ముషారఫ్ పలాయనంలో ఉన్నట్టు గురువారం పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ రావల్పిండి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు వెల్లడించిన తీర్పు తనకు వ్యతిరేకంగా కాదని పేర్కొన్నారు.

తాను తప్పకుండా పాక్ వస్తానని, భుట్టో కేసును ఎదుర్కొంటానని తెలిపారు. అయితే తాను ఆరోగ్య పరంగా పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే పాక్ వస్తానంటూ మెలిక పెట్టారు. తనను కావాలనే రాజకీయంగా ఇరికించారని ముషారఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. భుట్టో హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాగా, ఈ కేసులో ముషారఫ్‌ను పలాయనంలో ఉన్న నిందితుడిగా పేర్కొన్న కోర్టు అతడి ఆస్తులను జప్తు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్ తాజా ప్రకటన విడుదల చేశారు.

  • Loading...

More Telugu News