: ఐదో వన్డే: భారతజట్టు విజయ లక్ష్యం 239 పరుగులు!
కొలంబో వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. దీంతో, భారతజట్టు పరుగుల లక్ష్యాన్ని 239గా శ్రీలంక జట్టు నిర్దేశించింది.
శ్రీలంక బ్యాటింగ్ :
డిక్ వెల్లా (2), మునావీరా (48), తరంగా (4), తిరిమానె (67), మ్యాథ్యూస్ (55), సిరివర్ధన (18), హసరంగ డిసిల్వా (9), ధనంజయ్ (4) , పుష్పకుమార్ (8), మలింగా (2) ఫెర్నాండో 7 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
భారత బౌలింగ్ :
భువనేశ్వర్ కుమార్ - 5, బుమ్రా -2, కులదీప్ యాదవ్ -1, చాహల్ -1