: అతను చాలా డేంజర్.. నన్ను చావగొట్టేవాడు!: కంగనా రనౌత్


ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ తాజాగా ‘సిమ్రన్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా ‘ఆప్‌ కా అదాలత్‌’ కార్యక్రమంలో పాల్గొని సంచలన విషయాలు వెల్లడించింది. 2016లో రేగిన 'సిల్లీ ఎక్స్' వివాదం తరువాత హృతిక్‌ రోషన్‌ తనకు ఎదురుపడలేదని, కానీ అతనితో ఒకసారి ముఖాముఖి మాట్లాడాలనుకుంటున్నానని తెలిపింది. ఈ వివాదంలో హృతిక్‌ కు మద్దతు పలికిన ఆదిత్య పంచోలీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తెలిపింది. ఆదిత్య కుమార్తె కంటే తాను ఏడాది చిన్నదాన్నని తెలిపింది. తనకు 17 ఏళ్ల వయసప్పుడు సినీ పరిశ్రమకు వచ్చానని తెలిపింది.

సినిమాల విషయంలో తనను ఆదిత్య రక్తం వచ్చేలా కొట్టేవాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తనకు సాయం చేయమని అతని భార్య జరీనా వహబ్‌ ను వేడుకున్నానని తెలిపింది. అయితే ఆదిత్య ఇంటికి రావడం లేదని, దాంతో తాను హాయిగా ఉన్నానని తెలిపిందని కంగనా వెల్లడించింది. దీంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే తాను హింసలు అనుభవిస్తున్నట్టు తెలిస్తే తన తల్లిదండ్రులు బాధపడతారని ఫిర్యాదు చేయలేదని చెప్పింది. అయితే అప్పట్లో దీనిపై కంగనా పోలీసులను ఆశ్రయించిందని, పోలీసులు అతనిని పిలిచి, ఆమెకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్టు బాలీవుడ్ కథనం. కంగానా ఈ వివాదాలన్నింటినీ ఇప్పుడు బయటపెడుతుండడంతో కలకలం రేగుతోంది. 

  • Loading...

More Telugu News