: పాక్ ఖైదీ సనావుల్లాను స్వదేశానికి పంపండి: కట్జూ
జమ్మూకాశ్మీర్ జైల్లో భారత మాజీ సైనికుడి దాడిలో తీవ్రంగా గాయపడిన పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా రంజాయ్ ను స్వదేశానికి పంపాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ సూచించారు. సనావుల్లా ప్రస్తుతం చండీగఢ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సనావుల్లాను విడుదల చేయాలని కట్జూ అంటున్నారు.