: టీమిండియా బూర్జ్ ఖలీఫాజీ!...నీ ట్రైనర్ ఎవరో తెలిసిపోయింది!: మాజీ సహచరుడ్ని ఆటపట్టించిన సెహ్వాగ్
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ 29వ జన్మదిన వేడుకలను జరుపుకొన్నాడు. ఇషాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు మాజీ, తాజా క్రికెటర్లు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్ లో తనదైనశైలి ట్వీట్లతో ఆకట్టుకునే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తమాషాగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
1840 నాటి విక్టోరియా లేడీ భిన్న ముఖకవళికతో ఉన్న చిత్తరువును జతపరిచిన సెహ్వాగ్, 'ఎట్టకేలకు నీకు శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసుకున్నాను. ఎల్లప్పుడూ ఇలాగే ఎంటర్ టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఆ ఫోటోకు వ్యాఖ్యను జత చేశాడు. సెహ్వాగ్ విషెస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ ఏడాది ఆరంభంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో తనను వెక్కిరించిన ఆసీస్ సారధి స్మిత్ ను వెక్కిరిస్తూ పెట్టిన ముఖకవళికలు భారత క్రికెట్ అభిమాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. వాటిని గుర్తు చేసుకున్న సెహ్వాగ్ ఈ ట్వీట్ చేశాడు.