: నేను కనుక రైతును అయి ఉంటే.. ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకునే వాడినో.. గవర్నర్ విద్యాసాగర్ రావు
తాను కనుక రైతును అయి ఉంటే ఇప్పటికి చాలాసార్లు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడినని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుగా తనకున్న అనుభవంతో అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విషయంపై ఓ పుస్తకం కూడా రాస్తున్నట్టు తెలిపారు. 1983లో అడ్వకేట్‌గా సంపాదించిన సొమ్ముతో తన సొంత గ్రామమైన నాగారంలో మామిడి తోట వేసినట్టు తెలిపారు. సిరిసిల్లలోని కోనారావుపేటలో కోదండరామ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్ల తర్వాత గవర్నర్‌గా తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత నాగారంలోనే స్థిరపడతానని ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు తెలిపారు.