: బీరులో ఈత కొట్టాలనుందా?.... అయితే ఆస్ట్రియా వెళ్లాల్సిందే!


అవును... నిజమే! ఆస్ట్రియాలోని టార్రెంజ్ వ‌ద్ద ఉన్న 'ది శ్లాస్ స్టార్కెన్‌బ‌ర్జ‌ర్ బ్రూవ‌రీ'కి వెళ్తే నిజంగానే బీరులో ఈత కొట్టొచ్చు. బీరుతో నింపిన 13 అడుగుల వెడ‌ల్పు ఉన్న ఏడు ఈత కొల‌నుల‌ను ఈ బ్రూవ‌రీ యాజ‌మాన్యం ఏర్పాటుచేసింది. ప్ర‌పంచంలో ఇలా బీరుతో ఈత‌కొల‌నులు ఏర్పాటు చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఈ బీరు కొల‌నుల్లో రెండు గంట‌లు ఈత కొట్టాలంటే 200 పౌండ్లు అంటే రూ. 16518.60 చెల్లించాల్సిందే. బీరులో ఉన్న కాల్షియం, విట‌మిన్లు చ‌ర్మ స‌మ‌స్య‌లు రాకుండా కాపాడ‌తాయ‌ని వారు చెబుతున్నారు. అలాగే బీరులో స్నానం చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ని బ్రూవ‌రీ యాజ‌మాన్యం పేర్కొంది. ఇక్క‌డ మ‌రో స‌దుపాయం కూడా ఉంది. బీరు తాగుతూ ఈత కొట్ట‌డానికి వీలుగా ప్ర‌త్యేకంగా వేరే గ్లాసులో బీరును అంద‌జేస్తారు. అంతే త‌ప్ప‌ కొల‌నులో ఉన్న బీరును మాత్రం తాగొద్ద‌ని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News