: పవన్ కల్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేనంత శత్రుత్వం నాకు ఎందుకుంటుంది!: మహేశ్ కత్తి
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిమానులపై సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి మండిపడుతోన్న విషయం తెలిసిందే. వారు తనను టార్చర్ చేస్తున్నారని, పవన్ కల్యాణ్ తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఇటీవల డిమాండ్ చేశాడు. కాగా, ఈ రోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోన్న సందర్భంగా మహేశ్ కత్తి ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.
పవన్ ఫ్యాన్స్‌కి, తనకు మధ్య పోరాటం జరుగుతోందని, ఫ్యాన్స్ తమ తీరుని మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచన చేశాడు. ఈ సందర్భంగా నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేనంత శత్రుత్వం నాకు ఎందుకుంటుంది!’ అని మహేశ్ కత్తి పేర్కొన్నాడు.