: టీఆర్ఎస్ తో కలవం.. కేంద్ర కేబినెట్ లో ఆ పార్టీకి అవకాశం లేదు: లక్ష్మణ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. నయా నిజాం చేతిలో తెలంగాణ వంచనకు గురవుతోందని మండిపడ్డారు. రజాకార్ల వారసులైన ఎంఐఎంను ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని... కేంద్ర మంత్రివర్గంలో టీఆర్ఎస్ కు అవకాశం ఉండదని చెప్పారు.

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 17న నిజామాబాద్ లో తాము నిర్వహించబోతున్న బహిరంగసభకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరవుతారని చెప్పారు. విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించకపోతే... 2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. 

  • Loading...

More Telugu News