: 'కణం' పేరుతో తెలుగులో వస్తున్న సాయి పల్లవి సినిమా
'ఫిదా' సినిమాతో ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి. తెలంగాణ యాసలో సాయి పల్లవి ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు సాయిపల్లవి తమిళంలో విజయ్ దర్శకత్వంలో 'కరు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఏకకాలంలో తెలుగులో కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 'కణం' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.