: రాజీనామా అంశంపై ఇప్పుడు ఏం మాట్లాడలేను: బండారు దత్తాత్రేయ
కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి తన రాజీనామా అంశంపై ఇప్పుడు ఏం మాట్లాడలేనని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం వరంగల్ జిల్లా పరకాల వెళ్తున్నానని, ఇకపై ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. తన లాంటి వాళ్లు వందల మంది పార్టీలో ఉన్నారని, తన రాజీనామా ద్వారా తెలంగాణలో మరొకరికి అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా, కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమాభారతి, రాధా మోహన్ సింగ్, సంజీవ్ బలియాన్, గిరిరాజ్ సింగ్ కూడా తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.