: ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు
జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లా తంత్రిపొరా వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇతను మచివాకు చెందిన ఇష్ఫాక్ పద్దార్ గా అధికారులు గుర్తించారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పూంచ్ సెక్టార్ లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మృతి చెందారు.