: రూ. 7 పెరిగిన స‌బ్సిడీ వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌.. స‌బ్సిడీయేత‌ర సిలిండ‌ర్ ధ‌ర రూ. 73.5 పెంపు


ఆర్థిక సంవ‌త్స‌రాంతంలోగా స‌బ్సిడీల‌ను ఎత్తివేయ‌డానికి ప్ర‌తి నెలా వంట‌గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచాల‌నే ప్ర‌భుత్వ నిర్ణ‌యం నేప‌థ్యంలో స‌బ్సిడీ వంట గ్యాస్ ధ‌ర‌ను సిలిండ‌ర్‌కి రూ. 7 చొప్పున‌, స‌బ్సిడీయేత‌ర గ్యాస్ ధ‌ర‌ను సిలిండ‌ర్‌కు రూ. 73.5 చొప్పున పెంచారు. దీంతో 14.2 కేజీల స‌బ్సిడీతో కూడిన ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 487.18కి పెరిగింది. జూలై 31న కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వంట‌గ్యాస్ స‌బ్సిడీల‌ను త‌గ్గించ‌డానికి ప్ర‌తినెలా రూ. 4 చొప్పున పెంచాల‌ని చ‌మురు కంపెనీలను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

సంవ‌త్స‌రంలో కుటుంబానికి స‌బ్సిడీ కింద 12 సిలిండ‌ర్ల‌ను ఇస్తున్నారు. అంత‌కంటే ఎక్కువ కావాల్సి వ‌స్తే మార్కెట్ ధ‌ర‌లో కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏవియేష‌న్ ట‌ర్బైన్ ఇంధ‌న ధ‌ర‌లను కూడా చ‌మురు కంపెనీలు పెంచాయి. దీని ధ‌రను కిలోలీట‌ర్‌కి రూ. 48,110 నుంచి రూ. 50,020కి పెంచారు. అంతేకాకుండా పీడీఎస్ ద్వారా స‌ర‌ఫ‌రా చేసే కిరోసిన్ ధ‌ర కూడా రూ. 0.25 పెంచిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News