: భార్యను ముక్కలు చేసిన ‘టెక్కీ’ భర్తకు జీవిత ఖైదు విధించిన కోర్టు!
సుమారు ఏడేళ్ల క్రితం డెహ్రూడూన్ లో తన భార్యను హతమార్చిన ‘టెక్కీ’ భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఉత్తరాఖండ్ కోర్టు తీర్పు నిచ్చింది. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రాజేష్ గులాటి (38), తన భార్య అనుపమ (36)ను 2010, అక్టోబర్ 17వ తేదీ రాత్రి హతమార్చాడు. ఆపై ముక్కలు ముక్కలు చేసి వాటిని పాలిథిన్ కవర్లలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వాటిని బయట పడేశాడు. 2010, డిసెంబర్ 12వ తేదీన అనుపమ సోదరుడు ఎస్ కె మహంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ దారుణం గురించిన వివరాలు బయటపడ్డాయి.