: ఇలాగైతే తెలుగులో సినిమాలు తీయను: 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్


విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదే సమయంలో నలువైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది.  మహిళా సంఘాలైతే ఏకంగా థియేటర్ల వద్దకే వెళ్లి, సినిమాను చూడవద్దంటూ అడ్డుకుంటున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ, సినిమాను మహిళా సంఘాలు ఎందుకు అడ్డుకుంటున్నాయో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. ఇకపై కూడా ఇలాగే జరిగితే తాను ఏమీ చేయలేనని, ఇక తెలుగు సినిమాలు చేయనని... హిందీ, భోజ్ పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని చెప్పాడు. అక్కడ కూడా అడ్డుకుంటే, హాలీవుడ్ కు వెళ్లిపోతానని తెలిపాడు. 

  • Loading...

More Telugu News