: ఆసియా దేశాల్లో అవినీతిలో నెంబర్ వన్ స్థానంలోకొచ్చిన భారత్!
దేశాభివృద్ధికి నిరోధకంగా మారిన అవినీతిని అంతమొందించాలనే ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యం ఇప్పట్లో నెరవేరేది కాదని ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే జర్మనీకి చెందిన ఎన్జీవో సంస్థ తేల్చి చెప్పింది. భారత్‌లో ఆసియాలోనే అత్యంత అవినీతి ఉందని తాజాగా పోర్బ్‌స్ నిర్వహించిన ఓ సర్వేలో తేలిందని పేర్కొంది. ఆసియాలో అత్యంత అవినీతి జరుగుతోన్న ఐదు దేశాల జాబితాలో వియత్నాం, థాయిలాండ్, పాకిస్థాన్, మయన్మార్ లను భారత్ వెనక్కు నెట్టిందని పేర్కొంది. భారత్‌లోని పాఠశాలలు, ఆసుపత్రులు, ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే కార్యాలయాల్లో, పోలీసులలో అవినీతి అధికంగా ఉందని చెప్పింది.
మరోవైపు అవినీతిని అంతమొందించే విషయంలో ప్రధాని మోదీ చేస్తోన్న కృషిని కొనియాడింది. అవినీతిని రూపుమాపే క్రమంలో మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని భారతీయుల్లో చాలా మంది అభిప్రాయపడుతున్నారని తెలిపింది. ఈ సర్వేను 18 నెలల పాటు 16 దేశాల్లో 20,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి చేశామని పేర్కొంది.