: పాక్ జైళ్లలో మెంటల్ కేసులు!


సరబ్ జిత్ పై దాడి జరిగిన లాహోర్ లోని కోట్ లక్ పత్ జైలులోనే ఏదో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అక్కడ 36 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. వీరిలో 20 మంది తీవ్ర మానసిక అనారోగ్యం బారిన పడ్డారని వెల్లడైంది. అయినా వారికి ఎటువంటి వైద్య సహాయం అందించకుండా అక్కడి జైలు అధికారులు తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయం భారత్ - పాక్ న్యాయకమిటీ అధ్యయనంలో వెలుగు చూసింది. ఈ కమిటీ పాక్ లోని పలు జైళ్లను సందర్శించగా.. కోట్ లక్ పత్ జైలులో దారుణాలు వెల్లడయ్యాయి. అలాగే రావల్పిండి జైలులో ఇద్దరు, మలైర్ జైలులో మరొక భారత ఖైదీ కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీన్నిబట్టి అక్కడి జైళ్లు అంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News