: అమ్మ తిట్టిందని ఆమె మీద ప్రేమ తగ్గిపోతుందా?.. బాలయ్య కొట్టాడని కూడా అభిమానం తగ్గిపోదు: అభిమానుల పోస్టర్లు
దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘పైసా వసూల్’ సినిమా థియేటర్ల ముందు బాలకృష్ణ అభిమానుల సందడే వేరు. బాలకృష్ణతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించి, కొందరు అభిమానులు బాలయ్యతో చెంపదెబ్బలు కొట్టించుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాలయ్య కొత్త సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు వినూత్న రీతిలో పోస్టర్లు కనపడుతున్నాయి. కొన్ని పోస్టర్‌లలో ‘అమ్మ తిట్టిందని అమ్మ మీద ప్రేమ.. బాలయ్య బాబు తిట్టాడని ఆయన మీద అభిమానం ఎప్పటికీ చెరిగిపోవు.. జై బాలయ్య.. జై జై బాలయ్య’ అని అభిమానులు రాసుకొచ్చారు. కాగా, బాలయ్య బాబు ‘పైసా వసూల్’ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్ల ముందు అభిమానులు ఎలా డ్యాన్సులు వేస్తున్నారో చూడండి...