: భార‌త్‌లో ముస్లిం జెండా ఎగుర‌నీయ‌కుండా మోదీ అడ్డుకోలేడు.... హిజ్బుల్ ముజాహిద్దీన్ మాజీ క‌మాండ‌ర్ జాకీర్ ముసా సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌


భార‌త ఉప ఖండంలో ఇస్లాం జెండా ఎగ‌ర‌వేయ‌నీయ‌కుండా ప్ర‌ధాని మోదీ త‌మ‌ను అడ్డుకోలేర‌ని, ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా జెండా ఎగుర‌వేసి తీర‌తామ‌ని హిజ్బుల్ ముజాహిద్దీన్ మాజీ క‌మాండ‌ర్ జాకీర్ ముసా వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం అల్‌-ఖ‌యిదా క‌శ్మీర్ సెల్ అన్సార్ ఘ‌జ్వాట్ ఉల్ హింద్ నాయ‌కునిగా ఉన్న జాకీర్ యూట్యూబ్‌లో 10 నిమిషాల నిడివి ఉన్న ఆడియోను అప్‌లోడ్ చేశాడు. అన్సార్ ఘ‌జ్వా అధికారిక యూట్యూబ్ ఛాన‌ల్‌లో పెట్టిన ఈ ఆడియోలో గోవుల‌ను పూజించే హిందూ ప్ర‌ధాని మోదీ బారి నుంచి భార‌త దేశానికి స్వాతంత్ర్యం క‌ల్పిస్తామ‌ని జాకీర్ పేర్కొన్నాడు.

 జ‌మ్మూ కాశ్మీర్‌ను పూర్తి ఇస్లాం రాష్ట్రంగా మార్చేందుకు జాకీర్ చాలా సార్లు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకున్నాడు. త‌న మాట‌ల‌తో అక్క‌డి యువ‌కుల‌ను భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల మీద దాడికి దిగేలా ప్రేరేపించేవాడు. `గోవుల‌ను పూజించే న‌రేంద్ర మోదీ, త‌న రాజ‌కీయ, ద్వైపాక్షిక విధానాల ద్వారా ఎంత మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకున్నా మ‌మ్మ‌ల్ని ఆప‌లేడు. హిందూ దేశంలో ఇస్లాం ప‌తాకాన్ని మేం ఎగుర‌వేస్తాం. అంతేకాకుండా హిందూ పాల‌కుల‌ను గొలుసుల‌తో బంధించి లాక్కెళ్తాం` అని జాకీర్ ఆడియోలో అన్నాడు. కాశ్మీర్ మిలిటెంట్‌ ఉద్య‌మాన్ని ఇస్లామిక్ జిహాద్ విజ‌యంగా జాకీర్ ఉద‌హ‌రించాడు.

  • Loading...

More Telugu News