: కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు: మంత్రి నారా లోకేశ్
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 35 డివిజన్లలో టీడీపీ విజయకేతనం ఎగరవేయడంపై మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమకు పట్టం కట్టిన కాకినాడ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘అద్భుత విజయాన్ని అందించిన కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు! నారా చంద్రబాబునాయుడి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు అందించిన మరో విజయానికి ఇది సాక్ష్యం. కాకినాడ స్మార్ట్ సిటీ నిర్మిద్దాం పదండి!’ లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.